రాష్ట్రీయం

శ్రీశైలానికి మళ్లీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్: కృష్ణా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రారంభమైంది. ఎగువ జూరాల, తుంగభద్ర నుంచి 3,36.315 క్యూసెక్కుల వరదనీరు మంగళవారం శ్రీశైలం చేరుకుంది. జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంటుండడంతో అర్థరాత్రి తరువాత ఏ క్షణమైనా డ్యాం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు జలవనరులశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 6 సార్లు జలాశయం గేట్లు తెరిచారు. మళ్లీ వరద ప్రవాహం రావడంతో మరోమారు గేట్లు తెరిచే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో ఒకే ఏడాదిలో గేట్లను పలుమార్లు తెరవడం డ్యాం చరిత్రలో ఇదే మొదటిసారి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 884 అడుగులకు చేరుకోగా 210.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 26,365 క్యూసెక్కులు, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.