రాష్ట్రీయం

ఖమ్మంలో కదిలిన పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 19: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్ ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. ఎక్కడి బస్‌లు అక్కడనే నిలిచిపోయాయి. వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌ను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశ్యంతో అటు ఆర్టీసీ జేఏసీ నాయకుల్ని ఇటు అఖిలపక్ష రాజకీయ నాయకుల్ని ముందస్తుగా అరెస్టులు చేయించినా బంద్ సంపూర్ణంగా సాగింది. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పాటు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు జిల్లా వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించి, రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. మధిర, సత్తుపల్లి, ఇల్లందు పట్టణాలలో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించి బస్‌డిపోల నుండి బస్‌లు బయటకు రాకుండా నివారించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కేసీఆర్ పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో తెల్లవారుజామునే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బస్‌డిపో ముందు బైఠాయించారు. అనంతరం నగరంలో భారీ ప్రదర్శనలు నిర్వహించి రోడ్లపై కుర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, ప్రజల ఇబ్బందులను తీర్చాలని, విద్యార్థుల చదువులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్కచేయకుండా నిరంకుశంగా వ్యవహరించడం కేసీఆర్ పాలనకు మంచిపరిణామం కాదన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటామని వారు హెచ్చరించారు. ఉద్యమ సమయంలో పనికొచ్చిన సంఘాలు, ఆనాటి బందులు, ధర్నాలు, రాస్తారోకోలు ఈ రోజున ఆర్టీసీ కార్మికులు చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్ని నిర్బంధాలను ప్రయోగించినా సమ్మె ఉద్ధృతం అవుతుంది తప్ప కేసీఆర్ సాదించేది ఏమిలేదని గుర్తించాలన్నారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ దిగిరావాల్సిందేనని, లేకుంటే ప్రజలు గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. అలాగే హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించి ఆయన చేతి వేలు పూర్తిగా పోయేలా చేశారని దుయ్యబట్టారు. రంగారావుపై దాడిని జిల్లా వ్యాప్తంగా ఖండించిన నాయకులు ఆదివారం నిరసన తెలపాలని నిర్ణయించారు.