రాష్ట్రీయం

ఆరోగ్యాంధ్రకు 6 సూత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ పథకంలో వచ్చే జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2వేల వ్యాధులకు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు చికిత్స అందజేయనున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందులను ఉంచడం, శస్తచ్రికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం, తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారికి ప్రతినెలా పింఛను, కొత్తగా 104, 108 వాహనాల కొనుగోలు, ఆసుపత్రుల అభివృద్ధి వంటి చర్యల ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు మార్గదర్శక ప్రణాళిక అవసరమని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 2వేల వ్యాధులకు చికిత్సను జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. నవంబర్ 1 నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో ఆరోగ్యశ్రీ కింద 150 ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డెంగ్యూ, ఇతర సీజనల్ వ్యాధులకూ, డబుల్ కాంక్లియర్ ఇంప్లాంట్‌కు ఇందులో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి శస్తచ్రికిత్సలు చేయించుకున్నవారు కోలుకునేంత వరకూ ఆర్థిక సాయం నెలకు 5వేలు, లేదా రోజుకు 225 రూపాయలు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారితో సహా తలసేమియా, సిలిక్‌సెల్ అనీమియాతో బాధపడుతున్న వారికి 10వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. తీవ్ర పక్షవాతంతో వీల్‌చైర్‌కే పరిమితమైన వారు, రెండు కాళ్లు లేదా చేతులు లేనివారు, పనిచేయలేని స్థితిలో ఉన్నవారు, కండరాల క్షీణతతో పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి రూ. 5వేల పింఛను వర్తింపజేయాలన్నారు. జనవరి 1 నుంచి వీరికి పింఛన్లు చెల్లించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో బైకుల ద్వారా వైద్యసేవలను మారుమూల ప్రాంతాల్లో అందుబాటులోకి తేవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కమ్యూనిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధి పనులు డిసెంబర్ నుంచి మొదలు పెడతామన్నారు. డిసెంబర్ 2020 నాటికి పూర్తి చేస్తామన్నారు. బోధనాసుపత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా, నాణ్యమైన మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మందులు దొరకడం లేదన్న ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు. హెల్త్ సబ్ సెంటర్లలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా వచ్చే మే నుంచి ప్రారంభం కావాలన్నారు. డిసెంబర్ 21న ఆరోగ్య కార్డులు జారీ చేస్తామని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంపు
ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనం నెలకు 16వేల రూపాయలకు పెంచుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు పథకాన్ని కళాశాలల విద్యార్థులకూ వర్తింపజేయాలన్నారు. నెలరోజుల్లో దీన్ని పూర్తిచేయాలన్నారు. కంటి వెలుగు మాదిరిగా ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు పాఠశాల విద్యార్థుల స్థాయి నుంచి ప్రారంభించాలన్నారు. మధుమేహం, బీపీ లాంటి సమస్యలు తగ్గించేందుకు పాఠశాలలు, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆసుపత్రికి వస్తే డబ్బు కోసం వేచిచూడాల్సిన పనిలేకుండా చికిత్స అందించేలా చూడాలన్నారు. ప్రభుత్వం నుంచే కొంత మొత్తం దీనికి కేటాయించాలన్నారు. ఇందుకు అవసరమైన విధివిధానాలు ఖరారు చేయాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ జనవరిలో ప్రారంభించాలని సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.