రాష్ట్రీయం

నేడు రాష్ట్ర బంద్ కొనసాగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా చేపట్టిన బైక్ ర్యాలీ హైదరాబాద్‌లో శుక్రవారం రణరంగంగా మారింది. బైక్ ర్యాలీ కొనసాగిస్తామని జేఏసీ నేతలు, కుదరదని పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ వైఖరితో రహదారుల్లో యుద్ధవాతావరణం నెలకొంది. మరోపక్క శనివారం జరుగనున్న రాష్ట్ర బంద్‌పై చర్చించడానికి వెళ్తున్న జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోవడంతో విధిలేక రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర బంద్‌కు సకలజనుల మద్దతు లభించిందన్నారు. సమ్మెను విరమించడానికి న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అన్ని వర్గాల నుంచి రాష్ట్ర బంద్‌కు మద్దతు రావడంతో సీఎం కేసీఆర్ అసహనానికి గురవుతున్నారన్నారు. సమ్మెపై నిరంకుశ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయడం దుర్మార్గం అని ఆయన అన్నారు. రాష్ట్ర బంద్‌పై కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి శుక్రవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటున్న తమను పోలీసులు అరెస్టు చేసి, నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ఆయన చెప్పారు. నిర్బంధాలు, అరెస్టులు సమ్మెను ఆపలేవని స్పష్టం చేశారు. సమ్మెను విచ్ఛన్నం చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. యాజమాన్యంతో చర్చలు జరపడానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు గత 14 రోజులుగా సమ్మెలో పాల్గొన్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని జేఏసీ డిమాండ్ న్యాయమైనదని ఆయన అన్నారు. ప్రజారవాణా మెరుగుపడడానికి కొత్త బస్‌లను తక్షణం కొనుగోలు చేయాలన్నారు. కోర్టులో కేసు వేసి సమ్మె చట్టబద్ధం కాదని చెప్పడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదన్నారు. కోర్టులో కేసులు వేసి కార్మికులను భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనమన్నారు. కార్మికులను రెచ్చగొట్టడానికి కొన్ని పత్రికల్లో తమకు అనుకూలంగా వార్తలు రావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను బలోపేతం చేయడానికి జర్నలిస్టు సంఘాలు సైతం మద్దతు పలికాయన్నారు.
ఆర్టీసీ జేఏసీ తరఫున హైకోర్టులో వాదించడానికి దేశాయి ప్రకాశ్‌రెడ్డి ఉన్నారన్నారు. కాగా, తన ఆస్తులకు సంబంధించి వస్తున్న ఆరోపణపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. తన ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధమన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాధించినట్లు రుజువైతే తాను బహిరంగ ఉరిశిక్షకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో ఒకసారి కేసీఆర్ అరెస్టయ్యారని, తనను మాత్రం పోలీసులు రోజూ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు.