రాష్ట్రీయం

హైదరాబాద్‌లో హార్వర్డు కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: హైదరాబాద్‌లో హార్వర్డు పరిశోధనాకేంద్రం ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు కొనసాగుతున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ చెప్పారు. హైదరాబాద్‌ను విద్య, పరిశోధనలకు హబ్‌గా రూపుదిద్దుతున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం నాడు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ హార్వర్డు యూనివర్శిటీ ప్రతినిధి సవిత జీ అనంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ప్రొఫెసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై వినోద్‌కుమార్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్డింగ్ భారత్ బోస్టన్ బయోసైన్స్ - బీ4- స్ఫూర్తిని ఇచ్చే కార్యక్రమమని అన్నారు. వైద్య రంగంలో పలు అంశాలపై పరిశోధనలు జరిపేందుకు హార్వర్డు యూనివర్శిటీ త్వరలోనే హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా వంటి వ్యాధులు ప్రబలుతున్నందున అలాంటి వ్యాధులపై పరిశోధనలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని వినోద్ చెప్పారు.
లాసెట్ సీట్ల కేటాయింపు
రాష్ట్రంలోని లా కాలేజీల్లో సీట్లను కేటాయించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 3165, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో 1064, ఎల్‌ఎల్‌ఎంలో 554 సీట్లు ఉండగా, 7270 మంది అభ్యర్ధులు తమ వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వారిలో 2843 మందికి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, 889 మందికి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ , 513 మందికి ఎల్‌ఎల్‌ఎంలో సీట్లు కేటాయించారు. అభ్యర్ధులు 19వ తేదీ నుండి తమ అలాట్‌మెంట్ ఆర్డర్లను డౌన్‌లోడ్ చేసుకుని ఈ నెల 24వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని లాసెట్ అడ్మిషన్ల కన్వీనర్ పేర్కొన్నారు. ఈ నెల 21 నుండి లా కాలేజీల్లో క్లాసులు మొదలవుతాయని కన్వీనర్ పేర్కొన్నారు.
15న గీతం స్నాతకోత్సవం
గీతం వర్శిటీ పదో స్నాతకోత్సవాన్ని నవంబర్ 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు గీతం వర్శిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంగణంలో చదువుకున్న విద్యార్థులకు దీనిని పరిమితం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరంలో డిగ్రీలు, డిప్లొమోలు పొందడానికి అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆయన సూచించారు.