రాష్ట్రీయం

యురేనియం తవ్వకాలు నిలిపివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 18 : రెండు తెలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని సీపీఐ ఏపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం సమీపంలో గల పడమటి కంభంపాడు అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అనే్వషణ జరుగుతున్న ప్రాంతాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా యురేనియం తవ్వకాలు జరుగుతుంటే స్థానిక ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. అఖిల పక్షాలు, పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రజాసంఘాలు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టారన్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో యురేనియం తవ్వకాలను ఆపాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఇష్టారీతి తవ్వకాలతో పాటు ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం దారుణమన్నారు.