రాష్ట్రీయం

ముగిసిన సహస్ర చండీయాగ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ఈ నెల 13 నుండి నిర్వహిస్తున్న చతుర్వేద స్వాహకార పురస్పర రుద్ర హవన సహిత సహస్ర చండీ యాగం గురువారంతో ముగిసింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది రుత్విక్కుల మంత్రోచ్ఛరణల నడుమ 5 రోజుల పాటు నిర్వహించిన చండీయాగ పూజలను ఆయా ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులు తిలకించారు.
గురువారం 200 మంది పండితులతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మంత్రులు ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు పసునూరి దయాకర్, గువ్వల బాలరాజు, సతీష్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, తాటి వెంకటేశ్వర్లు, కందాల ఉపేందర్ రెడ్డి, మేకా అప్పారావు, రక్షణనిధి, వేముల వీరేశ్వం తదితరులు పాల్గొన్నారు. హాజరైన భక్తులకు కుంకుమ పూజలు పండితులచే చేయించి కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. జరుగుతున్న పూజలలో భక్తులకు, వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా చండీయాగ పూజలు జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు. ఐదు రోజుల పాటు హాజరైన భక్తులకు ఉదయం, రాత్రి వేళల్లో భోజన సదుపాయాలను, కల్పించి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు.
*చిత్రం...హోమం వద్ద పూజలు జరుపుతున్న రుత్విక్కులు