రాష్ట్రీయం

బోటు వెలికితీతకు మళ్లీ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయలు వశిష్ఠ పున్నమి టూరిజం బోటు వెలికితీసే పనులు బుధవారం తిరిగి ప్రారంభించారు. సెప్టెంబర్ 15న గోదావరి నదిలో మునిగిన బోటును వెలికితీసే బాధ్యతను కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ వర్క్స్‌కు చెందిన ధర్మాడి సత్యంకు అధికారులు అప్పగించారు. గతంలో నాలుగు రోజులు బోటును తీసే ప్రయత్నాలు చేశారు.
అప్పట్లో వేసిన లంగరు జారిపోవటం, ఐరన్ రోప్ తెగిపోవటం, వరద ఉద్ధృతంగా రావటం, వర్షాలు తదితరాల కారణంగా బోటు వెలికితీసే కార్యక్రమాన్ని జిల్లా అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేసి, సత్యం బృందాన్ని వెనక్కి రప్పించారు. పదిహేను రోజుల విరామం అనంతరం బుధవారం బోటు వెలికితీసే కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. మంగళవారం సాయంత్రానికే బోటు వెలికితీసే సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. బుధవారం ఉదయం 5 గంటలకు దేవీపట్నం నుంచి కచ్చులూరుకు పంటు, బోటు, సామాగ్రిని తీసుకుని వెళ్లారు. ముందుగా బోటు మునిగిన ప్రాంతాన్ని గుర్తించి, లంగరు వేశారు. దానికి సమాంతరంగా బోటు ఉన్న ప్రాంతం చుట్టూ 200 మీటర్లు వలయాకారంలో ఐరన్ రోప్‌ను చుట్టారు. లంగరు, రోప్‌లను ఇనుప గొలుసులతో సమాంతరంగా ఒకేసారి పొక్లయినర్‌తో లాగారు. ఈ ప్రయత్నంలో వలయాకారంలో వేసిన రోప్ జారిపోయింది. దీంతో వారి ప్రయత్నం ఫలించలేదు. బోటు ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించామని, బోటుకు వేసిన పెయింటింగ్ రోప్‌కు అంటుకుందని, బోటును తప్పక వెలికితీస్తామని, ఇందుకు రెండుమూడు రోజులు సమయం పడుతుందని ధర్మాడి సత్యం తెలిపారు. అవసరమైతే విశాఖ నౌకాదళ అధికారులను సంప్రదించి సాంకేతిక సహాయం తీసుకుంటామన్నారు. మునిగిన బోటు 120 నుంచి 150 అడుగుల లోతులో ఉండవచ్చునని భావిస్తున్నామని, గురువారం పూర్తిస్థాయిలో నిర్ధారణ చేస్తామని సత్యం తెలిపారు.
*చిత్రం...బోటు మునిగిన ప్రాంతంలో ఫంటు, బోటుకు లంగరు వేస్తున్న దృశ్యం