రాష్ట్రీయం

కేసీఆర్ సభపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతోందని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ గాంధీ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ, ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ ఫిర్యాదుచేసిందన్నారు. సీఎంకు చెందిన ఒక టీవీ చానల్, మీడియాలో భారీగా ప్రకటనలు ఇస్తున్నారని, వీటిని ఎన్నికల ఖర్చులో భాగంగా చూడాలన్నారు. పెద్ద ఎత్తున మద్యంట, డబ్బును పంపిణీ చేస్తున్నాన్నారు. వీటిని అరికట్టాలని ఎన్నికల ప్రదానాధికారి రజిత్ కుమార్‌ను కోరామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం టీఆర్‌ఎస్‌కు పట్టుకుందన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ వళ్లు పెట్టుకుని పనిచేయాలంటే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డిలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఎన్నికల కోడ్ ఉల్లంఘన దృష్టికి వస్తుందన్నారు. వీరిపై కేసులు నమోదు చేయాలన్నారు. హుజూర్‌నగర్ సభలో విధానపరమైన ప్రకటనలు చేసినా చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెతో అన్ని ఉద్యోగ సంఘాలు సకల జనుల సమ్మెకు సమాయత్తమవుతన్నాయని, కేసీఆర్‌ను గద్దె దించేంత వరకు మాదిగ దండోరా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా అడ్డుకుంటామన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ తోడుదొంగలని, వీళ్లు మేకవనె్న పులులన్నారు.