రాష్ట్రీయం

గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ ఇకపై రివర్స్ టెండరింగ్: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: ఇకపై గృహ నిర్మాణ పథకాలను కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావులేకుండా ఉండేందుకు అమలుచేస్తున్న రివర్స్ టెండరింగ్‌ను గృహనిర్మాణ ప్రాజెక్ట్‌లకూ వర్తింప చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు ఇకపై రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామన్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏపీ టిడ్కోలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు టెండర్లు ఖరారుచేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేశారని, ఈ విధానానికి స్వస్తి పలికే చర్యల్లో భాగంగా ఇప్పటికీ ప్రారంభం కాని పనులు రద్దు చేసి, కొనసాగుతున్న పనులను పునస్సమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో టిడ్కో ఆధ్వర్యంలో వివిధ గృహ నిర్మాణ, వౌలిక వసతుల కల్పన ప్రాజెక్ట్‌ల పనుల పురోగతి, వౌలిక వసతుల కల్పన ప్రాజెక్ట్‌ల స్థితిగతులను సమీక్షించిన అనంతరం ఈ పనులకు కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టేందుకు నిర్దేశించిన ఉత్తర్వులపై మంత్రి బొత్స సంతకం చేశారు.
రివర్స్ టెండరింగ్‌లో అనుసరించాల్సిన విధి విధానాలను మంత్రి ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్ట్‌ల వ్యయం తగ్గి ఖజానాపై భారం తగ్గుతుందని భావిస్తున్నామన్నారు. ఆయా పథకాల్లో లబ్ధిదారులపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని మంత్రి బొత్స వివరించారు. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో నోటిఫికేషన్ జారీ చేయనుంది.