రాష్ట్రీయం

మావోల కదలికలపై పోలీస్ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. దండకారణ్యాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గ్రేహౌండ్స్‌బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసు కమిషనర్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా 13 సంఘాలు పనిచేస్తున్నట్లు తమ దృష్టికి సమాచారం వచ్చిందని, ఈ సంఘాల బాధ్యుల కదలికలపై నిఘా పెట్టినట్లు ప్రకటించిన విషయం విదితమే. ఇటీవల కాలంలో విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలకు చెందిన వ్యక్తులు నిషేధిత మావోయిస్టు పార్టీ సానుభూతి పరులుగా పనిచేస్తున్నట్లు పోలీసు శాఖ గుర్తించింది. టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి, టీపీఎప్ ఉపాధ్యక్షుడు కృష్ణ తదితరులు నక్సలైట్ల సానుభూతిపరులుగా పనిచేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించిన విషయం విదితమే. రాష్ట్రంలో మావోయిస్టు పార్టీతో పాటు అనుబంధ సంఘాలు ఏడింటిపై నిషేధం 14 ఏళ్లుగా అమలులో ఉంది. తాము గుర్తించిన మరో 23 సంఘాలను కూడా నిషేధిత జాబితాలో చేర్చాలని రాష్ట్ర హోంశాఖకు కేంద్రానికి త్వరలో పోలీసు శాఖ ప్రతిపాదనలను పంపనున్నట్లు సమాచారం.
పోలీసు శాఖ అంచనా ప్రకారం తెలంగాణకు చెందిన 130 మంది నక్సలైట్లు అజ్ఞాత వాసంలో ఉన్నారు. వీరు దండకారణ్యంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన 110 మంది సభ్యుల్లో 25 మంది మాత్రం రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది,. మిగిలిన వారు దండకారణ్యంలో ఉన్నారని తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 22 మంది సభ్యులున్నారు. వీరిలో 11 మంది తెలంగాణకు చెందినవారు కావడం గమనార్హం. తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు బీ శంకరప్ప మద్దిలేటి, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షఉడు ఎన్ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలవో అరెస్టయిన నాగన్న ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో నక్సలైట్ల సానుభూతిపరులుగా ముద్రపడిన వారు యువతను ఆకట్టుకుని వారిని రిక్రూట్‌మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం సానుభూతిపరులుగా ముద్రపడి అరెస్టయిన మద్దిలేటి, కృష్ణ కోర్టు ఆదేశం మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. వీరు నిర్దోషులని, పోలీసులు అనుమానంతో తీసుకెళ్లి తప్పుడు కేసులు నమోదు చేశారంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్న విషయం విదితమే. మద్దిలేటి మహబూబ్‌నగర్ జిల్లాకు, కృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వారని పోలీసువర్గాలు తెలిపాయి.