రాష్ట్రీయం

చండీయాగానికి భారీగా భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగం మూడవ రోజు మంగళవారం ఉదయం, సాయంకాల సమయాల్లో కన్నులపండువగా పూజలు నిర్వహించారు. యాగపూజలను కనులారా చూసి తరించేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంతో తరలి రావటంతో మండప ఆవరణమంతా కిక్కిరిసి పోయింది. యాగ నిర్వాహకులు హాజరైన మహిళలకు ఉచిత పూజా సామగ్రిని అందజేసి దశల వారిగా పండితుల సమక్షంలో కుంకుమ పూజలు చేయించి మహిళలకు అమ్మవారి గుర్తు ఉన్న వెండి నాణాన్ని, గాజులను, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. హాజరైన ఇతర భక్తులకు కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాద లడ్డూని ప్రసాదంగా అందజేశారు. యాగ పూజల్లో భాగంగా గోమాతకు పొంగులేటి దంపతులు హారతి పూజలు చేశారు. పండితులు వేద మంత్రాలతో హోమ పూజలను నిర్వహిస్తూ మధ్య మధ్యలో భక్తి పాటలను ఆలపిస్తూ హాజరైన భక్తులను ఉత్సాహ పరిచారు. ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖులు సత్తుపల్లి, తిరువూరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రక్షణనిధి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు ఉదయం, రాత్రి సమయాల్లో అన్నదాన ప్రసాదాలను అందజేశారు. మూడవ రోజు సహస్ర చండీయాగాన్ని పురస్కరించుకొని సుమారు 8వేల మంది భక్తులు హాజరైనట్లు సమాచారం. హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేసి రాక పోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో గ్రామమంతా సందడిగా మారుతోంది.

*చిత్రం... చండీయాగం పూజలు నిర్వహిస్తున్న పండితులు