రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకువెళ్లిన ఇస్కాన్ భక్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 15: తిరుమల శ్రీవారిని ఇస్కాన్‌కు చెందిన విదేశీ భక్తుల బృందం మంగళవారం ఉదయం విరామ సమయంలో దర్శించుకున్నారు. ఈ క్రమంలో దర్శనానంతరం ఓ ఇస్కాన్ భక్తుడు ధ్వజస్థంభం వద్ద నుంచి తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకున్నాడు. ఇది గమనించిన టీటీడీ ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది స్పందించి ఆ భక్తుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అవగాహన లేకుండా సెల్‌ఫోన్‌ను ఆలయంలోకి తీసుకుని వచ్చిన ఆ భక్తుడి సెల్‌ఫోన్‌లో ఉన్న ఫోటోలను తొలగించారు. అనంతరం సెల్‌ఫోను తిరిగి అతనికి ఇచ్చారు.
వాస్తవానికి ఎలక్ట్రానిక్ వస్తువులు ( కెమెరా, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వాచీల)తో ఆలయంలోకి వెళ్లి పట్టుబడితే వాటిని హుండీలో వేయడం ఆనవాయితీ. అయితే ఇస్కాన్ భక్తుడు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన భద్రతాధికారులు ఆయనకు సెల్‌ఫోన్ తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుండా విరామ సమయంలో వెళ్లే భక్తులెవరైనా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు వైకుంఠం కాంప్లెక్స్‌లో టీటీడీ రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే వారు కూడా ఈ సెల్‌ఫోన్‌ను గుర్తించకపోవడం విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది.