రాష్ట్రీయం

కృష్ణా నీటి విడుదల ఉత్తర్వులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రబీ సీజన్‌లో వినియోగానికి నీటిని కేటాయిస్తూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వినియోగం ఈనెల 4వ తేదీ నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 79 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 69.346 టీఎంసీల విడుదలకు అనుమతించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 15 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 45 టీఎంసీలు, ఏలిమినేటి మాదవరెడ్డి ఎత్తిపోతల, హైదరాబాద్ మంచినీటి అవసరాల కోసం 17 టీఎంసీలు, మిషన్ భగీరథ పథకానికి మరో 2 టీఎంసీలు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.