రాష్ట్రీయం

చర్చలకు పిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత 10 రోజులుగా ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం బేషరతుగా ముందుకు రావాలని ఆర్టీసీ జేఏసీ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. సమ్మె పట్ల ఎంపీ కేశవరావు స్పందించడాన్ని ఆయన స్వాగతించారు. అటు సీఎం ఇటు ఆర్టీసీ జేఏసీల మధ్య కేకే మధ్యవర్తిత్వం వహించాలని ఆయన సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం షరతులేని చర్చలు జరపాలని ఆయన సూచించారు. సోమవారం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నేత్రుత్వంలో గవర్నర్ తమిళిసైని కలసి తమ న్యాయలైన కోర్కెలకు సంబంధించిన వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. గవర్నర్ భేటీ అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మొండివైఖరితో ఇద్దరు కార్మికులను కోల్పోయిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. కార్మికులు ఆందోళనతో ఎలాంటి అఘాయిత్యాలకు పూనుకోవద్దని ఆయన హితవు పరికారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిన విషయాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చలు లేకుండా ఒంటెద్దు పోకడలకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. తాము ఉన్నఫలంగా సమ్మె చేయడంలేదని, ఆర్టీసీ యాజమాన్యానికి గడువు ఇచ్చామన్నారు. అయితే, ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధ విధానాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదన్నారు. మంత్రులు పూటకోమాట మాట్లాడడం కార్మికులు మనోవేదనకు గురౌతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వ అధినేత కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలతో కార్మికుల్లో భయాందోళన మొదలైందన్నారు. తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో కార్మికులపై జరుగుతున్న దమనకాండపై గవర్నర్‌కు వివరించామన్నారు. టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ఆర్టీసీ జేఏసీపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని తాము తప్పు పట్టడంలేదన్నారు. ఉద్యోగ సంఘాలతో తాము భేటీ కావాలని అనుకున్నాం, అయితే, ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మరణంతో కలవడం కుదరలేదన్నారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని, తమకు ఏ రాజకీయ నాయకునితో ఒప్పందాలు లేవన్నారు. జేఏసీ మరో నేత రాజిరెడ్డి మాట్లాడుతూ మంత్రులు ఇష్టానుసారంగా ఆర్టీసీ కార్మికులపై మాట్లాడడంతో మనస్తాపానికి గురౌతున్నారన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా కేకే రాసిన లేఖపై తాము ఓపెన్‌గా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
*చిత్రం... రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు