రాష్ట్రీయం

వృద్ధులు, దివ్యాంగులకు నేడు ప్రత్యేక దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 14: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు మంగళవారం సంతృప్తికర దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ పిఆర్వో డాక్టర్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకోసం 4వేల టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే 5 సంవత్సరాల్లోపు పిల్లల తల్లితండ్రులకు ఈనెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారని ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
శ్రీవారి హుండీలో 5 కేజీల బంగారు ఆభరణం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీలో రూ. 2కోట్లు విలువచేసే 5 కేజీల బరువున్న బంగారు ఆభరణాన్ని ఓ అజ్ఞాత భక్తుడు సమర్పించినట్లు టీటీడీ ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం ఆ భక్తుడు ఈ ఆభరణాన్ని హుండీలో సమర్పించుకున్నారు. అయితే ఇది వడ్డాణమా లేక నాగాభరణమా అనేది తెలియడం లేదు. ఇందుకు సంబంధించి సదరు భక్తుడు ఈ ఆభరణాన్ని అధికారులకు నేరుగా ఇవ్వాలని ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే స్వామివారికి ఏవైనా అతి విలువైన ఆభరణాలు ఇవ్వదలుచుకుంటే ముందుగా టీటీడీని సంప్రదించడం, అధికారులు, ప్రధాన అర్చకుల సూచనలు మేరకు స్వామివారికి అవసరమైన ఆభరణాలు తయారు చేయించడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా వస్తోంది. శనివారం వడ్డాణం సమర్పించిన భక్తుడు తన ఆలోచన మేరకు వడ్డాణం తయారు చేయించడంతో ఆ ఆభరణాన్ని స్వామివారికి అలంకరించడానికి కొలతలు సరిపోక పోవడంతో అధికారుల సూచనలు మేరకు ఆ కానుకను హుండీలో సమర్పించినట్లు తెలుస్తోంది.