రాష్ట్రీయం

ఘనంగా సహస్ర చండీయాగ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 14: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగం పూజలు 2వ రోజు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ యాగాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పూజా కార్యక్రమాలను తిలకించారు. యాగ కార్యక్రమానికి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి చేరుకోవటంతో పొంగులేటి దంపతులు ఆయనకు పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికి యాగ మండపంలోకి ఆహ్వానించారు.
రెండవ రోజు పూజల్లో భాగంగా ఉదయం గురు, కుల దేవతా ప్రార్థన, ఏకోత్తర వృద్ధ్యా సప్తశతీ పారాయణాలు, నవావరణ పూజ, లక్ష్మీనారాయణ హృదయ పారాయణం, హోమము, సువాసిని, కన్యకాపూజ, విశేష హోమాలు, మహామంగళారతి చదుర్వేద యాగాలు, పారాయణాలు, మంత్ర పుష్పం, ప్రసాద వినియోగం వంటి పూజలను పండితుల వేదోచ్ఛరణలతో కన్నులపండువగా నిర్వహించారు. సాయంకాలం నవాక్షరీ మూల మంత్ర అనుష్ఠానం, ప్రముఖులచే ప్రసంగాలు, అష్టావధాన సేవ, రుద్ర క్రమార్చనం, తీర్థప్రాశనం వంటి కార్యక్రమాలు మంగళవాయిద్యాలతో నిర్వహించారు. ఓ వైపు యాగ పూజలు నిర్వహిస్తుండగా మరో వైపు మహిళలకు ప్రత్యేక కుంకుమ పూజలు దశలవారీగా నిర్వహిస్తుండటంతో అనేక ప్రాంతాల నుండి మహిళలు హాజరై కుంకుమ పూజలు పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కుంకుమ పూజలు చేసిన మహిళలకు ఉచిత పూజా సామాగ్రితో పాటు ప్రసాదాలు, వెండి అమ్మవారి బొమ్మ ఉన్న నాణెం అందజేశారు. ఈ యాగ పూజల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుండి ప్రముఖులు, ప్రజలు హాజరై యాగ పూజలు నిర్వహిస్తున్న తీరును చూస్తూ పరవశించి పోయారు. హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ వారి ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించారు. యాగ పూజల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి ప్రసాద రెడ్డి, పొంగులేటి దయాకర్ రెడ్డి దంపతులు పీఠలపై కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
*చిత్రం...హోమం వద్ద పూజలు నిర్వహిస్తున్న దృశ్యం