రాష్ట్రీయం

‘కచ్చులూరు’ మహా విషాదానికి సరిగ్గా నెల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: అఖండ గోదావరి నదిలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రైవేటు బోటు బోల్తాపడి నేటికి సరిగ్గా నెల రోజులైంది. నదిలోంచి బోటును వెలికి తీయడానికి సోమవారం మళ్ళీ చర్యలు మొదలయ్యాయి. దీంతో గల్లంతైన వారి ఆచూకి ఇప్పటికైనా లభిస్తుందేమోనని వారి బంధువుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. వారం రోజుల క్రితం వరద ఉద్ధృతి పెరగడంతో వెలికితీత పనులకు తాత్కాలికంగా బ్రేకుపడిన సంగతి విదితమే. వరద తగ్గుముఖం పట్టడంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మళ్ళీ బోటు వెలికితీతకు బాలాజీ మెరైన్ కంపెనీ సంస్థకు చెందిన ధర్మాడ సత్యం బృందం రంగంలోకి దిగింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మళ్లీ కచ్చులూరు చేరుకున్నాయి. గోదావరిలో నీటి ప్రవాహం సాధారణ స్థాయికి చేరడంతో బోటును వెలికితీసే పనులు మొదలయ్యాయి. గతంలో మాదిరిగానే రెండంచెల విధానంలోనే బోటును వెలికితీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోటు మునిగిపోయిన ప్రాంతంలో అంచనాగా చుట్టూ వలయాకారంలో సుమారు వెయ్యి మీటర్ల పొడవైన ఇనుప తాడును నదిలోకి వదిలి, దానిని లాగడం ద్వారా ఒక విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ఫలితం లేకపోతే ముందుగా బోటు మునిగిన ప్రాంతానికి సుమారు 200 మీటర్ల పరిధిలో చిన్న లంగర్లు వేయడం, దానికి తగిలిందనుకుంటే భారీ లంగర్లు వేసి క్రేన్లతో రెండు వైపులా కట్టి బయటకు లాగేందుకు ప్రయత్నించడం వంటి ప్రక్రియలు చేసేందుకు సన్నద్ధమై వెలికి తీత చర్యలు మొదలుపెట్టారు. ముంబై నుంచి వచ్చిన బృందం అత్యాధునిక టెక్నాలజీతో బోటును వెలికితీయాలని నిర్ణయించి తీరా అది సాధ్యం కాదని చెప్పి గతంలోనే తిరిగి వెళ్ళిపోయింది. బోటు 200 అడుగుల లోతులో ఉందని భావించడంతో వెనక్కి వెళ్ళిపోయిందని తెలుస్తోంది. అయితే ధర్మాడ సత్యం బృందానికి ఇటువంటి ప్రమాదాల్లో బోట్లను వెలికితీసే నైపుణ్యం ఉండటంతో రూ.22.70 లక్షల కాంట్రాక్టుతో బయటకుతీయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. లంగరుకు బోటు తగిలితే బయటకు లాగాలన్నది ప్లాన్ అయితే బోటు పూర్తిగా బురదలో కూరుకుపోయినట్టు తెలిసింది. ప్రమాదం జరిగి నెల కావడంతో ఇప్పుడా బోటును బయటకులాగితే అది బురదలో వుండటం వల్ల వెలికి తీసే క్రమంలో ముక్కలుగా విడిపోతుందనే వాదన విన్పిస్తోంది. అయినప్పటికీ బోటును వెలికితీసి తీరుతామని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది. గత నెల సెప్టెంబర్ 15వ తేదీన బోటు కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోల్తా పడింది. అందులో 77 మంది ప్రయాణించినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. సురక్షితంగా బయటకు వచ్చిన వారు 26 మంది కాగా గల్లంతైన వారు 51 మంది. ఇప్పటి వరకు 40 మంది మృతదేహాలు లభ్యం కాగా బంధువులకు అప్పగించారు. ఇంకా 11 మంది ఆచూకీ తెలియాల్సివుంది.