రాష్ట్రీయం

తిరుమలలో పెరిగిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : వరుస సెలవుదినాల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తుల రద్దీ శనివారం గణనీయంగా పెరిగింది. ఉచిత క్యూలైన్‌లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.2.86 కోట్లు ఆదాయం లభించినట్లు శనివారం మధ్యాహ్నం పరకామణిలో లెక్కలు కట్టారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించినట్లు పరకామణి వర్గాలు తెలిపాయి. దసరా సెలవులు, రెండోశనివారం, ఆదివారం వరుసగా సెలవుదినాలు కలిసిరావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. అందులోనూ తమిళ పెరటాసి మాసం 4వ శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.
దీంతో వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి సుమారు 3 కిమీ మేర భక్తులు స్వామిదర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వర్షం కురియడంతో క్యూ కాంప్లెక్స్ వెలుపల క్యూలైన్‌లలో బారులు తీరిన భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. స్వల్పతొక్కిసలాట జరిగింది. కాగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 55,000 మందికిపైగా స్వామివారిని దర్శించుకొని ఉంటారని అంచనా. మరో 40,000 మందికి పైగా స్వామిదర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా భక్తులకు అవసరమైన అల్పాహారం, కాఫీ, టీ, అన్నప్రసాదాలను టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. టీటీడీ అదనపు ఈ ఓ ధర్మారెడ్డి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈసందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆదివారం కూడా ఈరద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. కాగా రద్దీ పెరగడంతో వసతి దొరకని భక్తులు ఉద్యానవనాల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వామివారి దర్శనం ఆలస్యం కావస్తుండటంతో ముందురోజు గదులు తీసుకున్న భక్తులు గదులను ఖాళీ చేయకపోవడంతో వసతి కొరత ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
*చిత్రం...తిరుమలలో స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు