రాష్ట్రీయం

రూ.100 కోట్లు గోల్‌మాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: ఈఎస్‌ఏ ఆసుపత్రి మందుల కుంభకోణం వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. డైరెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి కోట్ల రూపాయల విలువ చేసే కుంభకోణంలో ప్రధాన పాత్రధారి కాగా, పలువురు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ఈ పాపంలో పాలుపంచుకున్నారు. మందుల కొనుగోలులో నకిలీ బిల్లులు సృష్టించి కోట్లు దండుకున్నారు ఈ కేసుకు సంబంధించిన నిందితులు. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఏసీబీ అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఏసీబీ 16 మందిపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇదిలా ఉండగా ఈ కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్లు కూడా గల్లంతైనట్టు గుర్తించారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తుంది. రూ.100 కోట్లకు సంబంధించి స్పష్టమైన వివరాలు లేకపోవడంతో వీటిని కూడా స్వాహా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు అధికారులు. వంద కోట్ల రూపాయల గోల్‌మాల్‌పై కేంద్ర కార్మిక శాఖ ఆరా తీస్తుండడమే అందుకు నిదర్శనంగా భావించొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు నిందితులను తమ కస్టడీకి తీసుకుని విడివిడిగా విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు.