రాష్ట్రీయం

గంగానది ప్రక్షాళన పోరాటానికి బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: గంగా నది ప్రక్షాళన పోరాటానికి బాసటగా నిలుస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. హరిద్వార్ పర్యటనలో ఉన్న పవన్ అక్కడ సదన్ ఆశ్రమంలో జరిగిన జీడీ అగర్వాల్ సంస్మరణ సభలో మాట్లాడారు. ప్రకృతిని పరిరక్షించాలని తపన పడే జీడీ అగర్వాల్ ఎంతో మహానీయుడని ఆయనను కోల్పోవడం జాతి దురదృష్టమని చెప్పారు. గంగానదిని స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, గంగానదిలోకి కాలుష్యం చేరకుండా నియంత్రించాలని అగర్వాల్ ఎంతో తపన పడ్డారని పేర్కొన్నారు.
గంగా నది ఉత్తర భారతానికో, మరో ప్రాంతానికో చెందినదే కాదని, యావత్భారతదేశానికి సంబంధించిందని అన్నారు. మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని కాపాడేందుకు ఆత్మత్యాగం చేసిన అగర్వాల్ స్ఫూర్తితో గంగానది పరిరక్షించుకోవడం ప్రాధమిక హక్కు అని భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలో రాజకీయాలు ఎన్ని ఉన్నా ఎందరు రాజకీయ నాయకులు ఉన్నా దేశ సాంస్కృతిక వైభవాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని పవన్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని నదులు సైతం కలుషితం అయ్యాయని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. హరిద్వార్ యాత్రి ఆశ్రమంలో కాలుష్యంపై జరిగిన సమావేశీంలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని నదులకూ కాలుష్యం ముప్పు పట్టుకుందని, తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ, గోదావరి, తుంగభద్ర మొదలైన నదులన్నీ పూర్తిగా కలుషితం అవుతున్నాయని అన్నారు. పరిశ్రమలు, గృహాల నుండి వచ్చే వ్యర్థాలను నేరుగా నదుల్లో కలిపేస్తున్నారని , తద్వారా పర్యావరణ సమతుల్యత గణనీయంగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో సహజ వనరులు కలుషితం అవుతున్నాయని, ఆంధ్రాలో విశాఖ నగరానికి వచ్చే పదేళ్లలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపాన్ని దాల్చబోతోందని , అక్కడ నీటిబొట్టు లభ్యమయ్యే పరిస్థితి గణనీయంగా పడిపోతోందని పవన్‌కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని నదులనూ పునరుజ్జీవింప చేస్తేనే ప్రజల దాహార్తిని తీర్చగలుగుతామని అన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలతో పోరాడటం చాలా కష్టమైన పని అన్నారు. పాలకులు హృదయం లేని వారని, వారికి తర్వాతి ఎన్నికల్లో అధికారమే పరమావధిగా మారిందని, హృదయం లేని ప్రభుత్వాలతో పోరాడటం చాలా కష్టమని పవన్ అన్నారు. నదుల ప్రక్షాళన కోసం, గంగానది ప్రక్షాళనకు స్థిరచిత్తంతో తాను పనిచేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో పవన్‌కళ్యాణ్‌తో ఆశ్రమ గురువు శివానంద మహరాజ్, వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్, ప్రొఫెసర్ విక్రమ్ సోనీ పాల్గొన్నారు.