రాష్ట్రీయం

పర్యాటకానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పన, సమర్థ నిర్వహణకై ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 నుంచి 20 వరకు సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను ఎంపికచేసి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలన్నారు. ఈ ప్రాంతాల్లో సెవెన్ స్టార్ తరహా సదుపాయాలు ఉన్న హోటళ్లను ఏర్పాటు చేయాలని, ప్రపంచ స్థాయిలో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. టూరిజం, ఆర్కియాలజీ, యువజన సర్వీసులు తదితర శాఖలపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యాటకంతో పాటు చారిత్రాక ప్రాంతాలను అభివృద్ధి చేయటంతో పాటు, అన్ని జిల్లాల్లో క్రీడా సదుపాయాలను కల్పించే విషయమై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో అడుగు పెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్ వైపు చూస్తున్నారని, అక్కడి పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండటమే కారణమన్నారు. రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపికచేసి తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. ఆతిథ్యరంగంలో ప్రఖ్యాత సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేలా ఉత్తమ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రచారం లభిస్తుందని తెలిపారు. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తరువాతే మార్కెటింగ్‌పై దృష్టి సారించాలన్నారు. కళింగపట్నం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. పూర్తి వివరాలతో మరోసారి సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. గండికోట అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, అక్కడ నదికి అడ్డుగా ఓ గాజు వంతెన కూడా నిర్మించేందుకు పరిశీలన జరుపుతున్నామని అధికారులు వివరించారు. తమకు అందించే నివేదికలో అన్ని వివరాలు సమగ్రంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం, పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతో పాటు విశాఖ జిల్లాలో అరకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటుకు రక్షణశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారనే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీటీడీసీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులు నిర్వహిస్తోందని, అయితే చాలా కాలంగా నిర్వహణకు కనీస నిధులు ఇవ్వనందున సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టి నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశించారు. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అరుదైన హస్త కళల్లో నైపుణ్యం కలిగిన ఏటికొప్పాక, కొండపల్లి, కలంకారీ కళాకారులను ఆదుకునే దిశగా కార్యాచరణ నిర్దేశించుకోవాలని సూచించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేసుల తయారీ, కలంకారీ తదితర అరుదైన హస్తకళలతో ఉపాధి పొందుతున్న కుటుంబాలకు తగు సహాయం అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. హస్త కళలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొండపల్లికి రోడ్లు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ధి కార్యక్రమాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరిలో తిరిగి బోట్లను నడపటంపై సమావేశంలో చర్చించారు. నదీ తీరాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. నిర్దిష్టమైన నిర్వహణ పద్ధతులు, కంట్రోల్ రూములపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి వ్యక్తమైన తరువాతే అనుమతి ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ఏర్పాటైన కమిటీ నివేదిక అందగానే సిఫార్సులపై చర్చిద్దామన్నారు. శిల్పారామాల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, గ్రీనరీపై అధికారులకు తగిన సూచనలిచ్చారు. శిల్పారామాలకు ఇబ్బంది లేకుండా అవసరమైన విధానానికి రూపకల్పన చేయాలన్నారు.
ప్రతి జిల్లాలో కల్చరల్ అకాడమీ
ప్రతి జిల్లాలో కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కనీసం ఐదెకరాల స్థలంలో ఈ అకాడమీలు నిర్మించి రెండేళ్లలో పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సంగీతం, నాట్యంతో సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్ అకాడమీలు వేదిక కావాలని అభిలషించారు. మన కళలు.. సంస్కృతిని నిలిపేందుకు.. వాటి ప్రాముఖ్యత పెంచటంలో అకడామీలు దోహద పడతాయన్నారు. సంగీత, నృత్య కళాశాలల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం బోధనా సిబ్బందికి జీతాలు పెంచాలని ఆదేశించారు.

జిల్లాకో క్రీడా సముదాయం
రాష్ట్రంలో క్రీడలు, సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రతి పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయనే విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎన్ని స్కూళ్లకు ఆటస్థలాలు అవసరమో సమగ్ర నివేదిక అందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఆట స్థలాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించు కోవాలని సూచించారు. ఫిజికల్ ట్రైనర్‌లు ఎంతమంది ఉన్నారనే అంశాలను కూడా నివేదికలో పొందుపరచాలని సూచించారు. విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియంల నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ సదుపాయాలతో స్టేడియంల నిర్మాణం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలని అందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. నిర్మాణాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో క్రీడా సముదాయాల ఏర్పాటుతో ప్రమాణాలు మెరుగుపడగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. గత ఐదేళ్లలో జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన గతంలో ఎన్నడూలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అమల్లోకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు. సమీక్షా సమావేశంలో పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాలశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.