రాష్ట్రీయం

లింగంపల్లి- విజయవాడ ఇంటర్ సిటీ రైల్ స్పీడ్ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగంపల్లి - విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్ సిటీ రైల్ స్పీడ్‌ను పెంచనట్లు ద,మ, రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన సమయాలను నవంబర్ 3వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. ఇంటర్ సిటీ స్పీడ్ పెంచడంతో లింగంపల్లి -విజయవాడ మధ్య సమయం 15 నిమిషాలు తగ్గుతుందన్నారు. లింగంపల్లిలో ఉదయం 4.40 గంటలకు బయలుదేరిన ఇంటర్ సిటీ 10.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి అదే రాత్రి 11.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. పిడుగురాళ్ళ- నల్లపాడు మధ్య విద్యుతీకరణ పూర్తి కావపంతో ప్రయాణ సమయంలో కొద్దగా మార్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. 12796-12795 ఈ రైళ్లు లింగంపల్లి నుంచి బేగంపేట, సికింద్రాబాద్, గుంటూరు. మంగళగిరి, విజయవాడకు నడుస్తుంటాయి.