రాష్ట్రీయం

మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కేఆర్. ఆమోస్ తీవ్ర అనారోగ్యంతో మల్కాజిగిరిలోని తన నివాసంలో మృతి చెందారు. టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అమోస్ 1969లో ఉద్యమ సమయంలో సర్వీస్ నుంచి డిస్మిస్ ఆయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీగా పనిచేసిన అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరా రు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి నడిపించిన ఆయన తర్వాతి దశాబ్దాల్లోనూ తన పోరాటాన్ని కొనసాగించారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత అమోస్ టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఎన్జీవో నే తగా, తెలంగాణ తొలి ఉద్యమ నేతగా, మలి తెలంగాణ ఉ ద్యమంలో తనవంతు పాత్ర పోషించిన ఆమోస్ మృతి పై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయకర్ రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బో యిన్‌పల్లి వినోద్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.

కేఆర్. ఆమోస్ (ఫైల్)