రాష్ట్రీయం

తెలంగాణ యువతకు ఆంధ్రలో ఉద్యోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాల నియామాల కోసం పోటీపడి ఉద్యోగాలకు ఎంపికైన తెలంగాణ యువకులకు అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి ఒక లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై సీరియస్‌గా చర్చించాలని సూచించారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఏ రాష్ట్రంలోనైనా 20 శాతం ఉద్యోగాలకు దేశంలో ఎవరైనా పోటీపడవచ్చని గుర్తుచేశారు. ఏపీలో గ్రామ సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాల నియామకంలో భారత పౌరులందరికీ సమానమైన అవకాశాలు కల్పించేలా చూడాలని కోరారు. ఈ మేరకు గతంలో హైకోర్టు
తీర్పు కూడా ఇచ్చిందన్నారు. సర్ట్ఫికేషన్ వెరిఫికేషన్ కోసం ఉత్తర్వులు పొంది కూడా, కేవలం ఆంధ్ర రాష్ట్రేతరులు అనే కారణంపై తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాష్ట్రప్రభుత్వం రాయితీ పొందుతున్నదెవరో అందరికీ తెలిసిన విషయమని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఐటీ రంగంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

*చిత్రం..కాంగ్రెస్ పార్టీ .సీనియర్ నేత జీవన్ రెడ్డి