రాష్ట్రీయం

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సెప్టెంబర్ 30న ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం నాడు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. ఈక్రమంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ విలేఖరులతో మాట్లాడుతూ ఉత్సవాలు తిలకించడానికి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినా, టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, పలు విభాగాల అధికారులు సమష్టిగా పనిచేయడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగిశాయని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
తొమ్మిదిరోజులు పాటు స్వామివారిని 7.07లక్షల మంది భక్తులు దర్శించుకుని హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 20.24కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గరుడసేవ రోజున భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్క గరుడసేవ రోజున శ్రీవారి ఆలయంలో ఉన్న మూలవిరాట్టును 92వేల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 34.01లక్షల శ్రీవారి లడ్డూలను భక్తులకు విక్రయించడం ద్వారా 8.82కోట్ల రూపాయలు ఆదాయం లభించిందన్నారు. మూడులక్షల మందికిపైగా గరుడవాహన సేవలో భక్తులు పాల్గొన్నారన్నారు. తొమ్మిదిరోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో 3.23లక్షల మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారన్నారు. 274మంది మహిళలు, 1,046మంది పురుష క్షురకులతో కలసి 1320మంది క్షురకులు పది కళ్యాణకట్టల్లో రోజుకు మూడు షిప్టుల చొప్పున 24గంటలు విధులు నిర్వహించి భక్తులకు ఉచితంగా తలనీలాలు తీశారన్నారు. తొమ్మిదిరోజుల్లో 27లక్షల మందికి భోజనాలు, అల్పాహారం అందించడం జరిగిందన్నారు. 14.67లక్షల యూనిట్ల పాలు, టీ, కాఫీని భక్తులకు ఉచితంగా అందించామన్నారు. ఒక్క గరుడ సేవ రోజును 2.47లక్షలమందికి అన్నప్రసాదం, అల్పాహారం, 3లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5లక్షల తాగునీటి బాటిల్స్‌ను భక్తులకు అందించామన్నారు. తిరుమలలోను, నడకదారుల్లోను 57వేలమంది భక్తులకు వైద్యసేవలను అందించామన్నారు. అదనంగా 45మంది డాక్టర్లు, 60మంది పారామెడికల్స్ సిబ్బంది భక్తులకు సేవలు అందించారన్నారు. పారిశుద్ధ్య పనులు చేసేందుకు 5వేలమంది సిబ్బంది నాలుగు మాడవీధులు, కాటేజీలు, యాత్రికుల వసతీ సముదాయాలు, మూహిక మరుగుదొడ్ల వద్ద సేవలు అందించారన్నారు.
ఒక్క గరుడసేవ రోజున 210టన్నుల చెత్తను తొలగించారన్నారు. రెండులక్షల మంది భక్తులు కూర్చుని వాహనసేవలు వీక్షించడానికి వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేశామన్నారు. చక్రస్నానం కోసం పుష్కరిణిలో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ విద్యుత్‌శాఖ సిబ్బంది ఈ ఉత్సవాల్లో అద్భుతమైన దేవతామూర్తులను విద్యుత్‌దీపాలంకరణలు ఏర్పాటు చేశారని, ఇవి భక్తులను ఎంతో ఆకట్టుకన్నాయన్నారు. మాడవీధులతో పాటు వివిద ప్రాంతాల్లో భక్తులు వాహనాలను వీక్షించేందుకు వీలుగా 36ప్రాంతాల్లో ఎల్ ఇ డి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. 40టన్నుల సంప్రదాయ పుష్పాలు, రెండుటన్నుల కట్ ఫ్లవర్లు, 50వేల సీజనల్ ఫ్లవర్లు వినియోగించామన్నారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆద్వర్యంలో దేశం నలుమూలల నుండి విచ్చేసిన ప్రముఖ పండితులతో ఆస్థానమండపంలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు నిర్వహించామన్నారు. వాహనసేవలు, రథోత్సవం, చక్రస్నానంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 1650 సిసిటీవీలు, బాడివోర్న్ కెమెరాలతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్వీబీసీ చానల్ ద్వారా ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. 324మంది శ్రీవారి సేవకులు, 500మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, 200మంది ఎన్ సీ సీ క్యాడెట్లు, 350మంది హోంగార్డులు, 340మంది టీటీడీ సెక్యూరిటీగార్డుల, 27మందితో కూడిన ఒక ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం, 24మంది గజ ఈతగాళ్లు భక్తులకు సేవలు అందించారన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీడియోవాల్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రత పర్యవేక్షించామన్నారు. ఆర్టీసీ బస్సుల తిరుపతి నుండి తిరుమలకు 4.29లక్షల మంది భక్తులను చేరివేశారన్నారు. గరుడసేవ నాడు తిరుపతి నుండి నుండి 2503 ట్రిప్పుల ద్వారా 93,552మంది భక్తులను, తిరుమల నుండి తిరుపతికి 2248 ట్రిప్పుల ద్వారా 68,327మంది భక్తులను చేర్చారన్నారు.
*చిత్రం...తిరుమలలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్