రాష్ట్రీయం

జల సంరక్షణకు ప్రభుత్వాలు కట్టుబడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : జలసంరక్షణ అవసరం ఎంతో ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం ఇక్కడి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ పర్యావరణవేత్త, జలసంరక్షకుడు రాజేంద్ర సింగ్‌తో పవన్ భేటీ అయ్యారు. వరదలు, వర్షాలు వస్తున్నా జల నిర్వహణ సమర్ధంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న వలసలకు వ్యవసాయ రంగం దెబ్బతినడం ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం కోసం జరుగుతున్న అనే్వషణ, జల సంక్షరణ, నీటి ఆవాసాలను కాపాడుకోవడంలో పాలకుల వైఫల్యాలపై పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్‌తో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. నల్లమలలో యురేనియం కోసం జరుగుతున్న అనే్వషణ ఫలితంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చెంచులు, పర్యావరణవేత్తలు వెల్లడించిన అనిప్రాయాలను పవన్ రాజేంద్ర సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణానికి త తీవ్ర విఘాతం కలుగుతుందని, దీనివల్ల మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నదులు, తటాకాల, చెరువులు కలుషితం అవుతున్నా ప్రభుత్వాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయని, పాలకులకు పర్యావరణంపై తగిన శ్రద్ధ లేదని దీనిని బట్టి తెలుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన తరఫున యురేనియం అనే్వషణ, తవ్వకాలపై నిర్వహించే సమావేశాలు, జలరక్షణ కార్యక్రమంలో పాల్గొంటానని రాజేంద్రసింగ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని నదీ పరివాహక ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని రాజేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు.
*చిత్రం...జనసేన అధినేత పవన్‌తో జల పర్యావరణ శాస్తవ్రేత్త రాజేంద్రసింగ్