రాష్ట్రీయం

దసరా సెలవులకు 28 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వచ్చే దసరా సెలవుల సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్ -కాకినాడ - నర్సాపూర్ - నాగర్‌సోల్ - విల్లుపురం నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అక్టోబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్- కాకినాడ (07003 -07004- 07075) మధ్య వచ్చిపోయే రైళ్లు వారానికి ఒకసారి నడుస్తాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్, వరంగల్ ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, బీమవరం, తనుకు, రాజమండ్రి, కాకినాడకు చేరుకుంటాయి, తిరుగుప్రయాణంలో అదే మార్గంలో నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఎలూరు, రాజమండ్రి, కాకినాడకు (07434- 07428) మధ్య రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్ -నర్సాపూర్ (07256- 07255) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్- నాగర్‌సోల్ ( 07145 -07063 -07064 -07063) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సికింద్రాబాద్- విల్లుపురం (తమిళనాడు) 06043 -06044 రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్ళు సికింద్రాబాద్, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, ఒంగోలు, సూళురుపేట, చెన్నై చంగల్‌పట్టు మీదుగావిల్లుపురం చేరుకుంకుంది, తిరుగుప్రయాణంలో ఆదే మార్గంలో ఈ రైళ్లు నడుస్తాయి. యశ్వంత్ పూర్- పాటలీపుత్ర ( 22351- 22353 ) మధ్య నడిచే రైళుకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. నాందేడ్ రైల్వే డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు.