రాష్ట్రీయం

తిరుమలకు శాశ్వత నీటి పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకేటశ్వరుడు కొలువుతీరివున్న తిరుమల క్షేత్రంలో నీటి సమస్యకు శాశ్వత పరిషరిష్కారమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. నూతనంగా ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలిలో 36 మంది సభ్యులకు గాను సోమవారం ఉదయం 17 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం నాడు ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన విషయం పాఠకులకు విదితమే. తిరుమలలోని అన్నమయ్యభవన్‌లో తొలి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను సుబ్బారెడ్డి విలేఖరులకు వివరించారు. తిరుమలలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అంశంపై చర్చకు తాను ప్రతిపాదించానన్నారు. బాలాజీ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 1 టీఎంసీ నీటిని తిరుపతికి తీసుకురావొచ్చని, తద్వారా తిరుమలలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పానన్నారు. ఇందుకు బోర్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా అంగీకరించారన్నారు. ఇందుకు సంబంధించి అంచనాలను కూడా సిద్ధం చేయాలని అధికారులకు సూచించామన్నారు. వచ్చే బోర్డు సమావేశంలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని టెండర్లను కూడా ఆహ్వానిస్తామన్నారు. గత పాలకమండలి తిరుపతి అవిలాల చెరువు సుందరీకరణకు టీటీడీ నిధులను వెచ్చించడానికి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు సంబంధించి టీటీడీ నిధులను పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం లేదని సమావేశంలో నిర్ణయించామన్నారు. ఎందుకంటే అది నగరపాలక సంస్థ చేపట్టాల్సిన అభివృద్ధి పనులన్నారు. అయితే ఇప్పటికే అవిలాల చెరువుకు సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు ఎంతవరకు అవసరమో వారికి ఆమేరకు ఖర్చుపెట్టడానికి నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పటి వరకు 28 కోట్ల రూపాయలు టీటీడీ నిధులను వెచ్చించిందన్నారు. మరో 20 కోట్ల రూపాయల నిధులను వ్యయం చేస్తామన్నారు. అక్కడ నీటి పైప్‌లైన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అటు తర్వాత వాటి నిర్వహణ బాధ్యతను తుడాకు అప్పగించాలని నిర్ణయించామన్నారు. భగవంతుడికి సంబంధించిన ప్రతి పైసా ఏ రూపంలో కూడా వృధా కాకూడదన్నది ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని, ఆదిశగానే తాము దృష్టిసారిస్తున్నామన్నారు. అమరావతిలో గత ప్రభుత్వం 140 కోట్ల రూపాయలతో ఒక పెద్ద శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా గోకులాలు, కళ్యాణమండపాలు, కాంప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించారన్నారు. ఇప్పటి వరకు అమరావతిలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, అలాంటప్పుడు స్వామి వారి నిధులను వ్యయం చేయాల్సిన అవసరం లేదని సమావేశం భావించిందన్నారు. అయితే రాజధానిలో శ్రీవారి ఆలయం కచ్చితంగా ఉండాలని, ఇందుకు సంబంధించి ఒకే ప్రహరీగోడతో 36 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు. అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు దృష్టిసారిస్తామన్నారు. అయితే తక్షణం శ్రీవారి ఆలయం నిర్మించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. తిరుమలలో పర్యావరవణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఇందులో భాగంగా తిరుమలలో విద్యుత్తు వాహనాల వినియోగం పెంచుతామన్నారు. ఇందుకు సంబంధించి బోర్డులో తీర్మానం చేశామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలా..లేదా టైమ్ స్కేల్ ఇవ్వాలా అన్న అంశంపై కూడా దృష్టిసారిస్తున్నామన్నారు. అంతే కాకుండా టీటీడీ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను వారికి వర్తింపజేసే అంశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు బోర్డు సభ్యులతో కమిటీ వేశామన్నారు. ముఖ్యంగా అటవీశాఖలో పనిచేసే సిబ్బంది సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రమణదీక్షితుల అంశంపై న్యాయస్థానంలో వ్యాజ్యం నుడుస్తున్న కారణంగా చర్చించలేదన్నారు. గరుడ వారధికి సంబంధించి సమావేశంలో చర్చకువచ్చిందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటించిందన్నారు. ఈక్రమంలో తిరుపతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులను అందిస్తుందన్నారు.