రాష్ట్రీయం

నేడు ప్రగతిభవన్‌లో కేసీఆర్, జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మంగళవారం హైదరాబాద్‌లో జరగాల్సిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం ఒక రోజు ముందుగానే సోమవారం జరుగబోతుంది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 24న ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం కావాలని మొదట నిర్ణయించారు. శాసనసభ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగడంతో మధ్యలో ఒక రోజు అధికారులకు విరామం ఇచ్చి మంగళవారం ఇద్దరు సీఎంలు సమావేశం కావాలని భావించారు. అయితే ఇతరత్రా కార్యక్రమాల కారణంగా ఒక రోజు ముందుగానే సోమవారం సమావేశం కావాలన్న ప్రతిపాదన సీఎం జగన్ నుంచి రాగా అందుకు సీఎం కేసీఆర్ కూడా సమ్మతం తెలిపినట్టు తెలిసింది. గోదావరి జలాలు కృష్ణకు తరలింపు, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ఇరువురు సీఎంలో గతంలో మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. చివరి మూడవ సమావేశంలో గోదావరి జలాలను శ్రీశైలం తరలించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ వేశారు. ఈ కమిటీలోని ఆంధ్రప్రదేశ్ సభ్యులు అక్కడి సీఎం జగన్‌కు, తెలంగాణ సభ్యులు ఇక్కడి సీఎం కేసీఆర్‌కు వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. అయితే ఇరు రాష్ట్రాల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ల బదిలీ తదితర కారణాల వల్ల సీఎంలు ఇద్దరి సమావేశం వాయిదా పడుతూ వచ్చి చివరగా సోమవారం హైదరాబాద్‌లో జరుగబోతుంది.

*చిత్రం...ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు (ఫైల్‌ఫొటో )