రాష్ట్రీయం

నేను శివప్రసాద్ కలసి చదువుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ తాను ఒకే స్కూల్‌లో చదువుకున్నామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.చెన్నై అపోలో ఆసుపత్రిలో చిక్సిపొందుతూ శనివారం మృతి చెందిన డాక్టర్ శివప్రసాద్ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో శివప్రసాద్ చిత్రపటానికి ఆయన ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శుక్రవారం చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్ళి శివప్రసాద్‌ను చూశానన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడానన్నారు. 24 గంటలు గడవక ముందే శివప్రసాద్ చనిపోవడం చాలా బాధవేస్తోందన్నారు. హైస్కూల్ చదివే రోజుల్లో కలసి చదువుకున్నామన్నారు. శివప్రసాద్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించానన్నారు. రాజకీయాలోకి వచ్చి ఎమ్మెల్యే, మంత్రిగా, రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నారన్నారు. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి పార్టీ ఇతర సీనియర్ నేతలు శివప్రసాద్‌కు నివాళులు అర్పించారు.