రాష్ట్రీయం

పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మొత్తం 1068 కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయాలని ఎప్పటి నుండే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియర్ పోరాటం చేస్తూనే ఉంది. పలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపి కారుణ్య నియామకాల కోసం ఒత్తిడి తీసుకుని వస్తోంది. ఈ క్రమంలోనే గత నెలలో 323 మంది అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహించిన యాజమాన్యం మిగిలిన 745పోస్టులకు సంబంధించి ఈనెల 12న ఈయూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా డిసెంబర్‌లోగా పోస్టులను భర్తీ చేయాలని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ దామోదరరావు విజ్ఞప్తి చేశారు. ఈయూ నేతల అభ్యర్థలతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు 745 కారుణ్య నియామకాలకు సంబంధించిన ఆదేశాలను బుధవారం జారీ చేశారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం పట్ల ఈయూ నేతలు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత వరకు జరిగిన కారుణ్య నియామాకల అభ్యర్థులలో ఎత్తు తక్కువ ఉన్నారని, 45ఏళ్లు దాటిన వారిని, పెళ్లయిన ఆడపిల్లలకు, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుటుంబ సభ్యులు పెట్టుకున్న అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టారని వీరికి కూడా ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి వారి కుంటుంబాలను ఆదుకోవాలని, న్యాయం చేయాలని ఈయూ నేతలు విజ్ఞప్తి చేశారు.