రాష్ట్రీయం

రవాణా శాఖ ఉద్యోగాలకు ప్రాథమిక ఎంపిక జాబితా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్‌లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్టు ఉద్యోగాలకు గతంలో ఇచ్చిన 10/2018, 11/2018 నోటిఫికేషన్ల ఆధారంగా గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన నిర్వహించిన లిఖిత పరీక్ష ఆధారంగా ప్రాధమిక ఎంపిక జాబితాను పబ్లిక్ సర్వీసు కమిషన్ సిద్ధం చేసింది.
ఆర్టీసీలో 72 పోస్టులు, రవాణా శాఖలో 1595 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్టీసీ పోస్టులకు సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ గత మే 29న పూర్తయింది. ఇక రవాణా శాఖ పోస్టులకు సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ వచ్చే నెల 18వ తేదీతో ముగియనుంది. వీరంతా తమ తమ ఆప్షన్లను ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఇవ్వాలని కమిషన్ అధికారులు సూచించారు.