రాష్ట్రీయం

శ్రీశైలానికి పెరిగిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, సెప్టెంబర్ 13: కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు, సుంకేసుల డ్యాం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. గత రెండు రోజుల క్రితం స్వల్పంగా వస్తున్న వరదనీటితో దశల వారిగా రెండు నుంచి నాలుగు గేట్లవరకు తెరిచి వరదనీటిని వదులుతున్నారు. వరద ప్రవాహం భారీగా పెరగడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకు 8 గేట్లు, 10 గంటలకు 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం మీద గత నెలలో రోజులలో 10 గేట్లను ఎత్తిడం ఇది రెండోసారి. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి శ్రీశైలం డ్యాం గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను 884.50 అడుగులుగా, గరిష్టనీటి నిలువ 215 టీఎంసీలకుగాను 212.9198 టీఎంసీలుగా నీటి నిలువ నమోదైవుంది. జూరాల ప్రాజక్టు వరద గేట్ల ద్వారా 2,27,866 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విద్యుత్ కేంద్రం ద్వారా 31,797 క్యూసెక్కులు,సుంకేసుల ద్వారా 43,790 క్యూసెక్కులు మొత్తం 3,03,453 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వస్తున్నది.