రాష్ట్రీయం

గూగూడులో కుళ్లాయిస్వామి అగ్నిగుండ ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి అగ్నిగుండ ప్రవేశం కన్నులపండువగా బుధవారం జరిగింది. మొహర్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో కుళ్లాయిస్వామి అగ్నిగుండ ప్రవేశం చేశారు. అంతకుముందు ముల్లాసాహెబ్ నిప్పులపై నడిచారు. ఆయన వెనుకనే స్వామి భక్తులు గోవిందా, గోవిందా అంటూ మండుతున్న నిప్పుల్లో నడిచారు. ఆఖరున కుళ్లాయి స్వామి అగ్నిగుండం ప్రవేశించారు. సాయంత్రం మరోసారి అగ్గిగుండ ప్రవేశం చేసిన అనంతరం జలధి ఉత్సవం జరిగింది. స్వామి మెరవణి, చివరి దర్శనం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.