రాష్ట్రీయం

తిరుమల ఎక్స్‌ప్రెస్ చక్రాల నుంచి పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, ఆగస్టు 25: విశాఖపట్నం-తిరుమల మీదుగా కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ చక్రాల నుండి వచ్చిన పొగతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆదివారం సాయంత్రం 4.23 గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుండి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగింది. ఆ తరువాత రెండు నిమిషాల్లో రైలు కదిలింది. కానీ మరలా ఆగిపోయింది. రైలు ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్థంకాలేదు. బీ-1 ఏసీ బోగీ చక్రాల నుండి పొగ రావడం గమనించిన రైల్వే గార్డు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. ఈలోగా ప్రయాణికులు కూడా పొగ రావడాన్ని గమనించి ఆందోళన చెందారు. ఆగిన రైలు నుండి అందరూ కిందకి దిగిపోయారు. అనంతరం రైల్వే సిబ్బంది బీ-1 బోగీ వద్దకు చేరుకున్నారు. బ్రేకు పట్టేయడంతో చక్రాల కింద నుండి పొగ వచ్చిందని నిర్థారించారు. 35 నిమిషాల అనంతరం సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా రైలును పంపించారు.
చిత్రం...పిఠాపురంలో స్టేషనులో నిలిచిపోయిన తిరుమల ఎక్స్‌ప్రెస్