రాష్ట్రీయం

మంత్రుల ‘రివర్స్’ ప్రచారంతో అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: మంత్రుల ‘రివర్స్’ ప్రచారంతో, ముందుచూపు లేకుండా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని, రాజధానిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాటలకు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు పొంతన కుదరటం లేదన్నారు. విజయవాడ దాసరిభవన్‌లో శుక్రవారం రామకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ ఆర్థికమంత్రి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది.. దీనిని సరిదిద్దాలంటే పదేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారన్నారు. ఆర్థిక వ్యవస్థ అంతగా అతలాకుతలమైతే వైసీపీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించకుండా తీసుకుంటున్న చర్యల వల్ల మరింత ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. రాజధాని ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరుగకుండా ఉందేందుకు బొత్స రివర్స్ ప్రచారం సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 26,27వ తేదీల్లో విజయవాడలో సీపీఐ కౌన్సిల్ సమావేశం జరుగుతాయని అన్నారు. రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు శుక్రవారం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులను విజయవాడ సీపీఐ కార్యాలయంలో కలిశారు.
రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా తమకు అండగా నిలవాలని రైతులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. రాజధాని ప్రాంతవాసులకు సీపీఐ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.