రాష్ట్రీయం

అసెంబ్లీ అధికారులకు నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 23: అసెంబ్లీ ఫర్నిచర్ తన వద్దే ఉంది, వచ్చి పట్టుకెళ్లండని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పినప్పటికీ అమలు విషయంలో అది సాధ్య పడలేదు. గుంటూరులోని కోడెల కుటుంబానికి చెందిన గౌతమ్ హోండా షోరూమ్‌లో తనిఖీలు చేసేందుకు శుక్రవారం వచ్చిన అసెంబ్లీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. షోరూమ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన అసెంబ్లీ అధికారులను కోడెల శివప్రసాద్‌కు సంబంధించిన న్యాయవాది అడ్డుకున్నారు. ఏ హోదాతో మీరు తనిఖీలు చేస్తారంటూ అసెంబ్లీ అధికారులను న్యాయవాది ప్రశ్నించారు. దీనికి అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ రాజ్‌కుమార్ స్పందిస్తూ తమకు శాసనసభ కార్యదర్శి ఆదేశాలు ఉన్నాయని చెప్తూ సంబంధిత లేఖను న్యాయవాదికి చూపించారు. అయితే అందులో షోరూమ్ ప్రస్తావన లేకపోవడాన్ని గుర్తించిన న్యాయవాది షోరూమ్‌లో తనిఖీలు చేసేందుకు అభ్యంతరం తెలిపారు. లిఖితపూర్వకంగా లేనిపక్షంలో షోరూమ్‌లో తనిఖీలు నిర్వహించేందుకు వీలు లేదని న్యాయవాది స్పష్టం చేయడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అసెంబ్లీ అధికారులు వెను దిరగాల్సి వచ్చింది.