రాష్ట్రీయం

1 నుంచి పెరగనున్న కాజ టోల్‌ప్లాజా రుసుములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 23: 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామం వద్ద విజయవాడ టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రుసుములు సవరించినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు ప్రకటించారు. ఎన్‌హెచ్‌ఎఐ ఆమోదానికి లోబడి రుసుములు సవరించినట్లు తెలిపారు. కారు, ప్యాసింజర్ వ్యాను లేదా జీపునకు సింగిల్ ప్రయాణం ఫీజును 90 రూపాయలు ఉండగా దీన్ని అలాగే ఉంచారు. అయితే ఒక్కరోజులో తిరుగు ప్రయాణం ఫీజు 135 రూపాయలు ఉండగా దాన్ని 140 రూపాయలకు, నెలసరి ఫీజును 2660 రూపాయల నుంచి 2775 రూపాయలకు పెంచారు. లైట్ కమర్షియల్ వాహనం (ఎల్‌సీవీ) లకు ప్రస్తుతం ఉన్న సింగిల్ ప్రయాణం ఫీజు 155 నుంచి 160 రూపాయలకు ఒక్కరోజులో తిరుగు ప్రయాణం ఫీజు 235 నుంచి 245 రూపాయలకు, నెలసరి పాస్ 4655 రూపాయల నుంచి 4855 రూపాయలకు పెంచారు. బస్సు, ట్రక్కులకు ప్రస్తుతం ఉన్న సింగిల్ ప్రయాణం ఫీజు 310 రూపాయల నుంచి 325 రూపాయలకు, ఒక్కరోజులో తిరుగు ప్రయాణం ఫీజు 465 నుంచి 485 రూపాయలకు, నెలసరి పాస్ 9310 రూపాయల నుంచి 9710 రూపాయలకు పెంచారు. రెండు పైన ఇరుసులు గల వాహనాలకు ప్రస్తుతం ఉన్న సింగిల్ ప్రయాణం ఫీజు 500 రూపాయల నుంచి 520 రూపాయలకు, ఒక్కరోజులో తిరుగు ప్రయాణం ఫీజు 750 నుంచి 780 రూపాయలకు, నెలసరి పాస్ 14965 రూపాయల నుంచి 15605 రూపాయలకు పెంచారు. టోల్‌ప్లాజా నుంచి 10 కిమీ, 20 కిమీ పరిధిలో ఉన్న స్థానిక కారు యజమానులకు వర్తించే నెలసరి పాస్‌రేట్లు 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరుగుతుందని టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. సవరించిన రుసుములు ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి అమల్లోకి రానున్నాయి.