రాష్ట్రీయం

బీజేపీతో టీఆర్‌ఎస్‌కు పోలికా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: విద్యుత్ రంగంలో భారీ స్కాంలు జరిగాయని తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే రుజువుచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకరరావు విద్యుత్ రంగ నిపుణుడని, తమకు ఎనలేని గౌరవం ఉందని ఆయన చెప్పారు. విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలపై తాము చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. తాము చేసిన ఆరోపణలకు పాలకులు సమాధానం చెప్పాలని ఆయన సవాలు విసిరారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా అరచినట్లుగా ఉందన్నారు. తమ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీకి పెరుగుతున్న ప్రజల మద్దతు, మా సభ్యత్వ నమోదుకు వస్తున్న ఆదరణ చూసి వారే భయపడుతున్నారన్నారు. ప్రపంచంలో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీ అని, 15 కోట్ల సభ్యత్వం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కూడా తమ పార్టీ సభ్యత్వం 36 లక్షలకు చేరుతోందన్నారు. బీమా తాయిలాలు ప్రకటించి సభ్యత్వం చేయించుకుంటోందన్నారు. 12 ఏళ్ల అబ్బాయికి కూడా సభ్యత్వం ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే నన్నారు. ఈ రోజు గ్రామాల్లో బీజేపీకి వస్తున్న స్పందన టీఆర్‌ఎస్ పార్టీకి రావట్లేదన్నారు. నిస్తేజంతో కేటీఆర్ అర్థం లేకుండా మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చే పార్టీ అని బీజేపీపై మాట్లాడడం సరికాదన్నారు. కేటీఆర్‌కు బీజేపీ మీద అవగాహన లేదన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోకపోతే పెన్షన్లు రావని, రైతు బంధు రాదని, కల్యాణ లక్ష్మి రాదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావని ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సభ్యత్వాలు అంటకడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మొదటిసారి తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిందన్నారు. రెండవసారి చంద్రబాబును బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. కేవలం అవకాశవాద రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు చేయడం తప్ప సంస్థాగత నిర్మాణం లేదని, సిద్ధాంతం లేదన్నారు. కేంద్రమాజీ మంత్రి చిదంబరంపై వచ్చిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోందని, ఈ కేసు కోర్టు విచారణలో ఉందని, కాంగ్రెస్ నేతలు నానాయాగీ చేయడం విచారకరమన్నారు. చిదంబరంను వెనకేసుకుని రావడం కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య వంటిదన్నారు.చిదంబరానికి అండగా నిలవకపోతే కాంగ్రెస్ పార్టీ రహస్యాలు బయటపెడుతారేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నరన్నారు. దీనిని బట్టి కాంగ్రెస్ క్రెడిబిలిటీ ఏమిటో అర్థమవుతోందన్నారు. దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ భాషలో మాట్లాడుతోందని, దేశాన్ని దోచుకున్న ఈ పార్టీని ప్రజలు గౌరవించరని ఆయన అన్నారు.