రాష్ట్రీయం

రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో ఉప రాష్టప్రతి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 23: భారత ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మూడురోజుల పర్యటన నిమిత్తం నెల్లూరుకు శుక్రవారం వస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడంతోపాటు గూడూరు- విజయవాడ మధ్య కొత్తగా మంజూరైన ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. వెంకయ్యనాయుడు ఈనెల 24న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుని వేదాయపాళెంలోని ఆయన నివాసానికి వెడతారు. విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి సాయంత్రం వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు వెడతారు. అనంతరం ప్రత్యేక రైలులో చెర్లోపల్లికి వెళ్లి రైల్వేటనె్నల్ పనులు పరిశీలిస్తారు. తిరిగి అదే రైలులో వెంకటాచలం వచ్చి సమీపంలోని స్వర్ణ్భారత్ ట్రస్టులో రాత్రి బస చేస్తారు. 25వ తేదీ ఉదయం 10.30గంటలకు రోడ్డు మార్గాన గూడూరు చేరుకుని గూడూరు-విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు కాకుటూరుకు చేరుకుని అక్కడి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ స్నాతకోత్సవంలో ఉపరాష్టప్రతితోపాటు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం స్వర్ణ్భారత్ ట్రస్టులో విశ్రాంతి తీసుకుని సాయంత్రం నెల్లూరు కనుపర్తిపాడులోని వీవీఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగే స్వర్ణ్భారత్ ట్రస్టు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల అనంతరం వేదాయపాళెంలోని తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 26వ తేదీ ఉదయం 9.30 గంటలకు విడవలూరు మండలం బొడ్డువారిపాళెంకు చేరుకుని అక్కడ మిశ్రదాతు నిగం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే గ్రీన్‌ఫీల్డ్ అల్యూమినియం అల్లాయ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. కేంద్ర రక్షణశాఖకు సంబంధించిన ఈ పరిశ్రమ శంకుస్థాపనలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం నెల్లూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో విజయవాడ బయలుదేరి వెడతారు. వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు కృష్ణపట్నం-ఓబులవారిపల్లె
రైల్వేలైన్‌ను పరిశీలించనున్న వెంకయ్య
చిట్వేల్: కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్‌ను ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు శనివారం పరిశీలించనున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మార్గంలో ఇప్పటికే గూడ్స్‌రైళ్లు తిరుగుతున్నాయి. త్వరలో ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ చర్యలు చేపడుతోంది. ఈ రైలు మార్గం కోసం వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. రైల్వేలైన్‌లో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు, కడప జిల్లా చెర్లోపల్లె మధ్య వెలుగొండ అడవుల్లో నిర్మించిన 7 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని వెంకయ్యనాయుడు పరిశీలించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3-20 గంటలకు నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వేస్టేషన్ నుండి ప్రత్యేక రైలులో వెంకయ్యనాయుడు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు చెర్లోపల్లె రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు.
సొరంగ మార్గాన్ని పరిశీలించిన అనంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొంటారు. 5-35 గంటలకు తిరిగి ఇదే మార్గంలో వెంకటాచలం వెళ్తారు. ఉపరాష్టప్రతి పర్యటన నేపధ్యంలో ఆర్డీఓ రామచంద్రారెడ్డి, కడప అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ రామకృష్ణ, ఇంటలిజెన్స్ డీఎస్పీ రాఘవేంద్ర, శరత్‌రాజు, అటవీ, రెవెన్యూ అధికారులు భద్రతాచర్యలు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.