ఆంధ్రప్రదేశ్‌

ఇక ఇళ్ల వంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత గత ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల రద్దుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఇళ్ల కేటాయింపులను రద్దు చేయడం గమనార్హం. గత ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు రద్దు చేయగా, ఏప్రిల్ 1 నాటికి ప్రారంభం కాని వివిధ ఇంజనీరింగ్ పనులు కూడా రద్దు చేయడం తెలిసిందే. దాదాపు రూ.610 కోట్ల విలువైన గ్రామీణ రహదారుల పనులనూ రద్దు చేశారు. తాజాగా ఇళ్ల కేటాయింపులను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తగినంత భూమి లభించని కారణంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన 6032 ఇళ్ల కేటాయింపులను రద్దు చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జి+3 విధానంలో చిత్తూరు జిల్లా కుప్పంలో 2000 ఇళ్లు, కృష్ణా జిల్లా కురుమద్దాలిలో 96 ఇళ్లు, విశాఖ జిల్లా చోడవరంలో 3936 ఇళ్లను నిర్మించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ స్కీమ్ కింద కుప్పం, కురుమద్దాలిలో రూ.104 కోట్లతో, చోడవరంలో రూ.199 కోట్లతో నిర్మించేందుకు పాలనా ఆమోదాన్ని మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి తగినంత స్థలం లేకపోవడం, టెండర్లు కూడా ఖరారు కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ రద్దు చర్చనీయాంశంగా మారింది.