రాష్ట్రీయం

గిట్టుబాటు ధరల చట్టాన్ని తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: రైతుల పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించే చట్టాన్ని , రైతులకు రుణమాఫీ చేసే చట్టాన్ని తసీకురావాలని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా 13 రాష్ట్రాలు 3.48 లక్షల కోట్ల రూపాయిల మేర రైతుల రుణమాఫీ చేశాయని, కానీ ఇంత వరకూ అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు రుణ మాఫీని అమలుచేయలేదని అన్నారు. 2019-20లో అఖిల భారత స్థాయిలో 12 లక్షల కోట్లు పంట రుణాలుగా ఇస్తామని ప్రకటించి, వాటిని కూడా అమలుచేయలేదని అన్నారు.కిసాన్ సమ్మాన్ పేరుతో 75వేల కోట్ల కేటాయించి దేశంలోని 14.35 కోట్ల మేర రైతు కుటుంబాలకు ఒకొక్కరికీ ఆరు వేల రూపాయిలు ఇస్తామని ప్రకటించి ఇంత వరకూ అమలుచేయలేదని అన్నారు. ఒకవైపు కరవు, మరో వైపు వరదల వల్ల రైతులు లక్షల కోట్ల విలువైన పంటలను నష్టపోయారని అన్నారు. రాష్టస్థ్రాయి విస్తృతస్థాయి సమావేశానికి మాదినేని రమేష్ అధ్యక్షత వహించగా, అఖిల భారత కిసాన్ సభ సంయుక్త కార్యదర్శి విజ్జుకృష్ణన్, సారంపల్లి మల్లారెడ్డి, పి జంగరెడ్డి, టీ సాగర్‌లు హాజరయ్యారు. ఇప్పటికే రైతులు దేశవ్యాప్తంగా 11 లక్షల కోట్లు బ్యాంకులకు బాకీపడి ఉన్నారని, అవి చెల్లించే స్థితిలో లేరని వారు అన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిచడం ద్వారా మాత్రమే తిరిగి రుణగ్రస్తులు కారని, మధ్య దళారీలు లక్షల కోట్లు రైతుల నుండి దోపిడీ చేయడం మూలంగా పదే పదే అప్పులు చేస్తున్నారని, అందుకు అనుగుణంగా రైతుల రుణమాఫీ చట్టం తీసుకురావాలని అన్నారు. గిట్టుబాటు ధరల కల్పనకు పార్లమెంటులో చట్టం చేయాలని , పెరుగుతున్న ఉపకరణాల ధరలు, ఇతర వ్యయాలకు అనుకూలంగా వ్యవసాయోత్పత్తుల ధరలు సీ2 ప్రకారం నిర్ణయించాలని అన్నారు. పెట్టుబడి పెరిగినప్పుడల్లా గిట్టుబాటు ధరలు పెరిగే విధంగా చట్టం రూపొందించాలన్నారు.