రాష్ట్రీయం

రైతుల చెంతకు ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సి ఉందని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మేధోమధన సదస్సు నిర్ణయించిది. వర్షాభావ ప్రాంతాల్లో ప్రధానంగా నీటిని పొదుపుగా ఉపయోగిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మేధోమధన సదస్సు నిర్వహించారు. సాయిల్ కన్సర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. నీటిసాంకేతిక విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. నీటి యాజమాన్యం, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడం, శాస్ర్తియ విధానంలో సాగు పద్ధతులు పాటించడం, ఎరువుల వినియోగంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు శాస్తవ్రేత్తలు పవర్‌పాయింట్ ప్రెసెంటేషన్ చేశారు.