రాష్ట్రీయం

యురేనియం తవ్వకాలతో నష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాల్లోని చెంచుపెంటల్లో రేవంత్‌రెడ్డి పర్యటించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లాపూర్, వటవర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు చెంచుపెంటల్లో రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా చెంచులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. యురేనియం తవ్వకాల విషయంపై వారితో చర్చించారు. రేవంత్‌రెడ్డితో కొందరు చెంచులు మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో తమ ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని తాము ఎంతకైనా పోరాటం చేస్తామంటూ తెగేసి చెప్పారు. చెంచుజాతి మనుగడ లేకుండా పాలకులు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంచులకు, నల్లమల అడవికి అవినాభావ సంబంధం ఉందని, అడవి అంటే తాము తల్లితో సమానంగా చూసుకుంటామని తల్లికి బిడ్డలను దూరం చేయాలనుకే వారి అంతు తేలుస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం మల్లాపూర్ చెంచుపెంటలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం
తవ్వకాలపై తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలు అంటూ ప్రారంభిస్తే చెంచుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా నిలిచి వారి పోరాటంలో ముందు వరుసలో ఉంటుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలకు ఎవరైనా వస్తే చెంచులు తమ పోరాటం ఎలా ఉంటుందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు అంటూ జరిగితే కృష్ణానది కలుషితం కావడం ఖాయమని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కలుషితమైన నీటితో ఉంటాయని దాంతో రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని అన్నారు. చెంచుజాతి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఓ ప్రకటన చేయాలని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు లేవంటూ చెబితే చెంచులు ప్రశాంతంగా జీవిస్తారని అన్నారు. తాను ఈ విషయాన్ని పార్లమెంట్‌లో సైతం లేవనెత్తుతానని వెల్లడించారు.
రాష్ట్రానికే నల్లమల అటవీ అందాలు ఎంతోపేరు తెచ్చాయని అలాంటి అందాలు గల నల్లమలను లేకుండా చేయాలనుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముర్ఖత్వమేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యురేనియం తవ్వకాలపై నోరువిప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. చెంచు ప్రజలు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తాను ఈ విషయాన్ని ఢిల్లీలో వినిపిస్తానని చెంచుల తరపున పార్లమెంట్ గళం విప్పుతానని అన్నారు. పాలమూరు ప్రజలంతా నల్లమలను కాపాడుకోవడానికి చెంచులకు అండగా నిలవాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, వంగూర్ జడ్పీటీసీ కేవిఎన్‌రెడ్డి, చెంచుపోరాట సమితి నాయకులు, నల్లమల అటవీ సంరక్షణ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా రేవంత్‌రెడ్డి రెండు రోజుల పాటు నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించడంతో వివిధ మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

చిత్రం...నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల ఇచ్చిన విల్లంబుతో
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి