రాష్ట్రీయం

దేశమంతా ఒకే విద్యుత్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యుత్ విధానం ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం ఉన్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదన్నారు. అయినప్పటికీ ఇంకా దేశంలో చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయని, మరికొన్ని చోట్ల విద్యుత్ కోతలు ఉంటున్నాయని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యుత్ విధానం అవసరమన్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి విద్యుత్ కేంద్రాలు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి వచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మ ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ పరిస్థితులపై చర్చ జరిగింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలిచింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే పురోగతి సాధ్యం కాదని భావించాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించాం. ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలను ఎత్తివేశాం. ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. రాష్ట్రంలో పరిశ్రమలు మూడు షిప్టులు పని చేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి, రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో ఓల్టేజి తలెత్తకుండా
ఉండేందుకు ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణంగా వ్యివస్థను సిద్థం చేశాం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తమకు ఎంతో సహకారం అందించిందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంథ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి కార్పొరేషన్ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని సీఎం అన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోది నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించడం పట్ల రాజీవ్ శర్మకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ వ్యవధిలో పరిష్కరించుకుని, మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడానికి కార్పొరేషన్ అందించిన సహకారం ఎంతో ఉందన్నారు.
ఈ సందర్భంగా పిఎఫ్‌సి సీఎండి రాజీవ్ శర్మ మాట్లాడుతూ, తెలంగాణలో దార్శనిక సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో రికార్డు సమయంలో అటు విద్యుత్ కేంద్రాలు, ఇటు నీటిడారుదల ప్రాజెక్టులు పూర్తి చేశారని ప్రశంసించారు. నీటిపారుదల ప్రాజెక్టులు ఇంత త్వరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు పొందడం, నిధులు సమీకరించుకోవడం, భూ సేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవడం వంటి వాటితో ముడిపడి ఉండటంతో ప్రాజెక్ట్‌ల నిర్మాణం సాధారణంగా ఆలస్యం అవుతుందన్నారు. అయితే తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. తాము విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులకు అందించిన ఆర్థిక సహకారాన్ని నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకుందని రాజీవ్ శర్మ అభినించారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావడం తమకెంతవ గర్వంగా ఉందన్నారు. ‘మూడున్నరేళ్ల కిందట హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారు. ఇది సాధ్యమేనా అనిపించింది. అయితే నేను కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజీలు, పంపుహౌజ్‌లు కళ్లారా చూశాను. ఎంతో అద్భుతం. మూడున్నరేళ్ల కిందట కేసీఆర్ ఏం చెప్పారో అది కళ్లముందు కనిపించింది’ అని రాజీవ్ శర్మ వ్యాఖ్యానించారు. తెలంగాణలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు కృషి ఉందని ఈ సందర్భంగా రాజీవ్‌శర్మ,సీఎం కేసీఆర్ కొనియాడారు.

చిత్రం...హైదరాబాద్‌లో ఆదివారం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్