రాష్ట్రీయం

శ్రీవారి సహస్ర దీపాలంకార సేవలో నిర్మలా సీతారామన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సాయంత్రం శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి దర్మారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఊరేగింపులో ఆమె పాల్గొన్నారు. స్వామి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణ చేసుకుని శ్రీవరాహస్వామిని దర్శించుకున్నారు. పుష్కరిణి హారతి అందుకున్నారు. ఆ తరువాత శ్రీవారి ఆలయంలోకి వెళ్లి స్వామివారిని మహాలఘుదర్శనం చేసుకున్నారు. కేంద్రమంత్రికి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...శ్రీవారి వాహన సేవలో పాల్గొన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్