రాష్ట్రీయం

టెన్త్ విద్యార్థి ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఆగస్టు 17: విశాఖ జిల్లా చోడవరంలోని ఆడమ్స్ స్కూల్ విద్యార్థి కేతా తేజ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టిక ఒక క్రమంలో ఒక నిమిషం పది సెకన్లలో పూర్తిచేసి ఈ ఘనతను సాధించాడు. ఏజెన్సీ ప్రాంతమైన జి.మాడుగులకు చెందిన కేతా తేజ పదో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను అతితక్కువ సమయంలో వేసి ప్రపంచ రికార్డు సృష్టించాడని ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త రంగారావు ఈ సందర్భంగా ప్రకటించారు. శనివారం స్కూల్‌లో అధికారులు, పుర ప్రముఖులు, మేధావుల సమక్షంలో తేజ ఆవర్తన పట్టికను వేసే క్రమాన్ని చేసి చూపించాడు. గతంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన తరుణ్ అగర్వాల్ అనే విద్యార్థి ఇటువంటి ఆవర్తన పట్టికను ఒక నిమిషం 29 సెకన్లలో వేసి ప్రపంచ పట్టికను నెలకొల్పగా తాజాగా విద్యార్థి తేజ ఈ రికార్డును మొదటి దఫా ఒక నిమిషం 13 సెకన్లు, రెండోమారు ఒక నిమిషం తొమ్మిది సెకన్లు, మూడవ సారి ఒక నిమిషం ఐదు సెకన్లలో ఆవర్తన పట్టికను వేసి ప్రపంచ రికార్డును సృష్టించాడని రంగారావు ప్రకటించారు. ఈ సందర్భంగా తేజాకు ప్రపంచ రికార్డు ధ్రువపత్రం, బంగారు పతకాన్ని అందజేసారు. విద్యార్థితోపాటు అతని తల్లిదండ్రులను కూడా పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్ అధికారి రాంనరేష్, ఆడమ్స్ స్కూల్ సంచాలకులు బి. వెంకట్రావు, విశ్రాంత అధ్యాపకులు ఎన్. దేముడు మాస్టారు, తదితరులు పాల్గొన్నారు.