రాష్ట్రీయం

క్లినికల్ ఫార్మసీ జాతీయ సదస్సు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఫార్మా పరిశ్రమలో మరిన్ని పరిశోధనలు జరగాలని, అందుకు నేటి ఫార్మా విద్యార్థులు నడుంబిగించాలని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే క్లినికల్ ఫార్మసీ జాతీయ సదస్సును శనివారం నాడు జేఎన్‌టీయూహెచ్‌లో ఆయన ప్రారంభించారు. మందులను సరసమైన ధరలకే సామాన్యుడికి అందేలా ఈ పరిశోధనలు చేయాలని, మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలాం పేర్కొన్నట్టు దేశం కోసం పరిశోధనలు అంకితం కావాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, డిస్పెన్సరీల్లో ఫార్మా విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య, ఐఎస్‌టీ డైరెక్టర్ డాక్టర్ బీ వేంకటేశ్వరరావు, డాక్టర్ ఎం సునీతారెడ్డి, రెక్టార్ డాక్టర్ ఎ గోవర్థన్ , డాక్టర్ ఆర్ కార్తీక, ముజుబుద్దీన్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ యాదయ్య మాట్లాడుతూ ఆరోగ్యసంరక్షణలో ఫార్మా పరిశ్రమ పాత్ర అమోఘమైనదని అన్నారు.