రాష్ట్రీయం

ఆరు జిల్లాలకు జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ దర్పణ్’లో తెలంగాణకు చెందిన ఆరు జిల్లాలు జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచాయని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ప్రకటించింది. దేశంలో 700 జిల్లాలు ఉండగా, వీటిలో వరంగల్ (గ్రామీణ), జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిర్సిల్లా, కరీంనగర్ జిల్లాలో మొదటిస్థానంలో నిలిచాయని, ఈ జిల్లాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. స్వచ్ఛ దర్పణ్‌లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ‘స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమాన్ని చేపట్టింది. మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, నిర్వహణ, కమ్యూనిటీ సోక్‌పిట్స్, కంపోస్ట్ పిట్స్, స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలపై అవగాహన పెంచడం, జియోట్యాగింగ్ పరిశీలన తదితర అంశాలపై బాగా పనిచేస్తున్న 100 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. దేశంలోని 8 జిల్లాలకు నూటికి నూరు మార్కులు రాగా, వీటిలో ఆరు జిల్లాలు తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం. స్వచ్ఛ దర్పణ్‌లో మంచి ఫలితాల కోసం పనిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, జడ్పీపీ సీఈఓలు, ఎంపీపీలు, సర్పంచ్‌లతో పాటు డీఆర్‌డీఏ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బందికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందలు తెలిపారు.